ఫైలేరియా వ్యాధిపై వైద్యుల అవగాహన
బాసర మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 16
మండల కేంద్రమైన బాసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులతో పాటు సిబ్బంది ఇంటింట తిరుగుతూ బోదకాలు వ్యాధిపై అవగాహన కల్పించారు. బోధకాలు (ఫైౖలేరియా)ను నిర్మూలించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్యాధికారి ప్రభాకర్, సూపర్వైజర్ సునంద పలు కాలనీలలో తిరుగుతూ కాలనీ వాసులకు రక్త పరీక్షలు చేసి నివారణ మాత్రలను అందించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాత్రలను పంపీణీ చేసి ఫైలేరియా రహిత మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని వైద్యులు తెలిపారు. ప్రజలు సకాలంలో వ్యాధిని గుర్తించి వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే పూర్తిగా నయం చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేష్, సిబ్బంది రాజ్యలక్ష్మి, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు