రేపటి నుండి కేంద్ర సాయుధ బలగాల్లో ఫిజికల్ టెస్ట్‌లు ప్రారంభం

కేంద్ర సాయుధ బలగాలు ఎస్‌ఐ పోస్టుల ఫిజికల్ టెస్ట్‌లు
  • ఎస్‌ఐ పోస్టుల కోసం కేంద్ర సాయుధ బలగాల నియామక ప్రక్రియ తుది దశకు
  • ఢిల్లీ పోలీసు, సీఏపీఎఫ్‌ విభాగాలకు ఫిజికల్ టెస్ట్‌లు అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 వరకు
  • అభ్యర్థుల పీఈటీ, పీఎస్‌టీ పరీక్షా హాల్‌ టికెట్లు విడుదల

 

కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్‌ఐ పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాత పరీక్ష పూర్తయిన అనంతరం, పీఈటీ, పీఎస్‌టీ దేహ దారుఢ్య పరీక్షలు అక్టోబర్ 14 నుండి నవంబర్ 11 వరకు దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగనున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లోని సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా, ఇప్పుడు ఫిజికల్ ఎండ్్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) పరీక్షలు నిర్వహించనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకారం, ఈ పరీక్షలు అక్టోబర్ 14 నుండి నవంబర్ 11 వరకు ప్రధాన కేంద్రాల్లో జరుగుతాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటి సీఏపీఎఫ్‌ విభాగాల్లో 4,187 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి.

శారీరక పరీక్షలు పూర్తయిన అనంతరం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment