హాసకొత్తూరు కాంగ్రెస్ సీనియర్ నేతల వినతి — సీనియర్లకు న్యాయం చేయాలని డిమాండ్

హాసకొత్తూరు కాంగ్రెస్ సీనియర్ నేతల వినతి — సీనియర్లకు న్యాయం చేయాలని డిమాండ్

హాసకొత్తూరు కాంగ్రెస్ సీనియర్ నేతల వినతి — సీనియర్లకు న్యాయం చేయాలని డిమాండ్
మహేష్ గౌడ్, శ్రీధర్ బాబు, సీతక్క లకు వినతి పత్రం అందజేత

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 17

హాసకొత్తూరు కాంగ్రెస్ సీనియర్ నేతల వినతి — సీనియర్లకు న్యాయం చేయాలని డిమాండ్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల మల్లేష్, పాలెపు రాజేశ్వర్ లు శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. అనంతరం టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి సీతక్క ను పర్సనల్ సెక్రటరీల ద్వారా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “2017 నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నాం. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే ల గెలుపులో కీలక పాత్ర వహించాం. కానీ తాజాగా పార్టీలోకి వచ్చినవారికి ఇందిరమ్మ కమిటీల్లో స్థానం, బి ఫామ్ లు, పదవులు ఇస్తున్నారు. సీనియర్లు అడిగితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు. కాబట్టి సీనియర్లకు న్యాయం చేసి, కలహాలు లేకుండా స్థానిక స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి,” అన్నారు. అలాగే హాసకొత్తూరు గ్రామానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క బీసీ రిజర్వేషన్ స్థానానికి విద్యావంతుడు, సీనియర్ నాయకుడు పడాల మల్లేష్ కి కాంగ్రెస్ తరపున పోటీ అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ ఇంచార్జ్ సీతక్క దీపావళి తర్వాత నిజామాబాద్ ను పిలుస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగ మధుసూదన్, పొడేటి ధర్మయ్యా, ధనరాజ్, సురేష్ లు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment