వ్యక్తిత్వ లక్షణాలే దీర్ఘాయుష్షుకు కీలకం: పరిశోధన
మంచి వ్యక్తిత్వ లక్షణాలు, చురుకుదనం, సాయపడే మనస్తత్వం, సమయపాలన, బాధ్యత వంటివి దీర్ఘాయుష్షుకు దోహదపడతాయని జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అసంతృప్తి, ఆందోళన, ఒత్తిడి వంటివి జీవితకాలాన్ని తగ్గిస్తాయని పేర్కొంది. 22,000 మందిపై 28 ఏళ్లపాటు జరిపిన ఈ అధ్యయనంలో, మనస్సాక్షికి అనుగుణంగా నడిచేవారు, సమయపాలన పాటించేవారు ఇతరులకంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తేలింది