జెకై కరాటే బెల్ట్స్ పరీక్షల్లో సంస్కార్ విద్యార్థుల ప్రతిభ

జెకై కరాటే బెల్ట్స్ పరీక్షల్లో సంస్కార్ విద్యార్థుల ప్రతిభ

మనోరంజని ( ప్రతినిధి )

భైంసా : జనవరి 06

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అన్నబాహు సాటే భవనానములో కరాటే కలర్ బెల్ట్స్ గ్రేడింగ్ టెస్టులను జపాన్ కరాటే అసోసియేషన్ అఫ్ నిర్మల్ ఆధ్వర్యంలో తెలంగాణ కరాటే రాష్ట్ర జాయింట్ సెక్రటరీ- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరాటే ఎక్సమినర్ సెన్సాయ్ తేజేందర్ సింగ్ భాటియా నిర్మల్ జిల్లా కరాటే అధ్యక్షులు కొండాజీ శ్రీకాంత్, కార్యదర్శి అమ్ముల భూషణ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహిళా శిక్షకురాలు ఏడిపెల్లి మృణలిని ఆధ్వర్యంలో జెకై బెల్ట్స్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో భైంసా పట్టణంలోని సంస్కార్ పాఠశాలకు చెందిన 2వ తరగతి చదుదువుతున్న కృషిక, 4వ తరగతి చదువుతున్న శ్రీరాముల ప్రణీల్ రాజ్ పరీక్షలో పాల్గొని జూనియర్ రెడ్ బెల్ట్స్ లను మరియు సర్టిఫికెట్స్ అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా మర్శల్ ఆర్ట్స్ సీనియర్ శిక్షకులు శ్రీరాముల సాయికృష్ణ, శివరాజ్ గౌడ్, అజయ్ నాయక్, రాజశ్రీ, ప్రతిక్ష, అనూష, అనన్య, జ్ఞానతేజ శిక్షకులు పాల్గొన్నారు.
క్రీడాకారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కరాటే తో తమ పిల్లలకు ఆత్మరక్షణతో పాటు శారీరకంగా మానసికంగా ఎదుగుతారని, ఆలోచనల శక్తిని మరింత పెంపోందించుకుంటారు అని వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment