ప్లాస్టిక్ భూతం పెనుముప్పు అని తెలిసిన వినియోగిస్తున్న ప్రజలు
సెప్టెంబర్ 12 కుంటాల: ప్లాస్టిక్ తో పర్యావరణం అస్తవ్యస్తమవుతుంది ప్లాస్టిక్ కవర్లు భూమిలో చేరి భూమిలోకి వర్షపు నీరు ఇంకా కుండా చేస్తుంది ప్లాస్టిక్ కవర్లు కాల్చితే విషపూరితమైన పొగ మానవుల ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తున్నాయి. భూమిపై వేస్తే భూమి కాలుష్యం నీటిలో వేస్తే జలజీవ మనుగడకు కష్టాత్తరమవుతుంది, ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం చెత్త బండ్లలో వేయడం వల్ల ఇతరవేర్థాలనుండి ప్లాస్టిక్ కవర్లను వేరు చేయడం పారిశుద్ధ్య కార్మికులకు సమస్యగా మారిందని అంటున్నారు. మార్కెట్ కి వెళ్లేటప్పుడు ప్రజలు బట్ట సంచులను తీసుకువెళ్లాలని ప్లాస్టిక్ కవర్ల వాడటం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని పలువురు విద్యావంతులు అంటున్నారు