- పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ సీఎంను కలిసారు.
- రాబోయే ఎన్నికల సవాళ్లపై ప్రధానంగా సమన్వయం చేయాలని లక్ష్యం.
- బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.
: పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల సమన్వయం ప్రధాన సవాల్‌గా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం నివాసంలో జరిగిన గణపతి పూజలో కూడా ఆయన పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా: పీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మహేశ్ కుమార్ గౌడ్ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల సమన్వయమే తనకు ఎదురవున్న అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ పదవి కోసం పోటీ పడిన వారితో కలిసి పని చేస్తానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గణపతి పూజలో మహేశ్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తానని, ప్రభుత్వానికి మరియు పార్టీకి వారధిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ కమిటీల నియామకం త్వరలోనే జరుగుతుందని ప్రకటించారు.