అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం చేపట్టకపోతే నిరాహారదీక్ష ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం చేపట్టకపోతే నిరాహారదీక్ష ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం చేపట్టకపోతే నిరాహారదీక్ష

ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

మనోరంజని ప్రతినిధి బాసర జులై 06

బాసర ఆలయం పునర్నిర్మాణం చేపట్టకపోతే వచ్చే దసరా, దీపావళి సమయంలో ప్రభుత్వ తీరు పై నిరహరదీక్షకు దిగుతానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హెచ్చరించారు. బాసర తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బాసర ఆలయ అభివృద్ధి పై అప్పటి, ఇప్పటి ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయన్నారు. వెనక్కి మళ్ళిన 42 కోట్ల నిధులను సత్వరం ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు.. గతంలో ఆడెల్లికి, బాసర ఆలయానికి ఒక్కో దానికి 50 కోట్లు నిధులిస్తే.. అక్కడ పనులు జరిగాయాని, ఇక్కడ గత పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్ల నిధులు వెనక్కి వెళ్ళాయన్నారు. 2027 లో గోదావరి పుష్కరాలు వస్తున్న తరుణంలో వెనక్కి మళ్ళిన 42 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment