జడ్పిటిసి బరిలో పవార్ రాజు
మనోరంజని, తెలుగు టైమ్స్, సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 05
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని హనుమాన్ తాండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పవార్ రాజు, తాజాగా విడుదలైన జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో బరిలో దిగుతున్నారు. ఈసారి సీటు ఎస్టి జనరల్‌గా మారడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు అవకాశం దక్కే అవకాశాలున్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. విద్యా మరియు రాజకీయ అనుభవం కలిగిన పవార్ రాజు, ప్రజాసేవకు తన సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ శ్రేణుల్లో మంచి గుర్తింపు కలిగిన రాజు, గ్రామస్థుల మద్దతుతో విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నారు.