అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

కుభీర్ మనోరంజని ప్రతినిధి జులై 29

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మండల కేంద్రం కుభీర్ లోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి ఆహార భద్రత కల్పించి, ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడు రేషన్ కార్డును భద్రపరచుకోవాలని, ప్రతి సంక్షేమ పథకానికి ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment