అరకులో పాస్పోర్ట్ ఆఫీస్
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వ్యాలీలో కొత్త ప్రాంతీయ పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని విదేశాంగశాఖ ప్రారంభించింది. పోస్టుల శాఖతో కలిసి ఏర్పాటైన ఇది దేశంలో 443వ పాస్పోర్ట్ కేంద్రం కాగా, విశాఖపట్నం పరిధిలో 8వ ప్రాంతీయ కేంద్రమని తెలిపింది. దీని ప్రారంభంలో అరకు ఎంపీ తనూజ రాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ KJ.శ్రీనివాస్ పాల్గొన్నారు