- ప్రధాన రహదారుల పక్కన ఇష్టానుసారంగా పొట్టు లారీల నిలిపివేత
- మహారాష్ట్రకు అధిక లోడుతో ఊక తరలింపు
- వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు, గందరగోళం
- సంబంధిత అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల ఆగ్రహం
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలో ప్రధాన రహదారుల పక్కన పొట్టు లారీలు అధిక లోడుతో నిలిపి వేయడం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట రోడ్లు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు సంబంధిత శాఖలపై మామూళ్ల మత్తులో ఉండి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రం మరియు కోటగిరి ప్రాంతాల్లో ప్రధాన రహదారుల పక్కనే పొట్టు లారీల నిలిపివేత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొట్టు లారీలు ఉమ్మడి జిల్లాల రైస్ మిల్లుల నుండి ఊక సేకరించి అధిక లోడుతో మహారాష్ట్రకు తరలిస్తున్నాయి. రాత్రిపూట వీటిని రోడ్లపై నిలిపి వేయడం వల్ల పొట్టు దుమ్ము గాలిలో చేరి వాహనదారులకు రోడ్డు కనిపించడం కష్టంగా మారుతోంది.
ఇష్టానుసారంగా లారీల నిలిపివేత వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వాహనదారుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.