పార్లమెంటు ప్రజా సమస్యల పరిష్కార వేధిక కావాలి

పార్లమెంటు ప్రజా సమస్యల పరిష్కార వేధిక కావాలి

పార్లమెంటు
ప్రజా సమస్యల పరిష్కార
వేధిక కావాలి

పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రజల ఆకాంక్షల కనుకులంగాప్రజాసమస్యలపై చర్చకు పార్లమెంట్ సభ్యులు సిద్ధంగా ఉండాలని శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాచరికం _ప్రజాస్వామ్యం
బ్రిటిష్ పాలన అంతరించిన తర్వాతమన జాతీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంపిక చేసుకొని ప్రజలస్వేచ్ఛ’ స్వాతంత్రం సౌభ్రాతృత్వం ‘ సమానత్వం ప్రాతిపదికన రాజ్యాంగం బద్ధమైన పార్లమెంటరీ పాలన విధానాన్నిఅనుసరిస్తున్నాం
అందరికి సమాన అవకాశాలు
రాజ్యాధికారంలో అందరికి సమాన అవకాశాలు కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ పురుడు పోసుకుంది. దేశ ప్రజల సంక్షేమానికిఉజ్వలభవిష్యత్తు కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం.
ప్రజా సంక్షేమం_అభివృద్ధి
మన దేశ కేంద్ర ‘రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజాసంక్షేమానికి’ అభివృద్ధికి పెద్దపీట వేయడం గమనార్హం. మానవ వనరుల సంక్షేమానికి దొహదపడే చట్టాలను రూపొందించడంలో చట్టసభలు ‘ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానాలను అనుసరిస్తున్నాం.వనరుల సేకరణ ‘వనరుల వినియోగం’ పెట్టుబడుల సమీకరణ’ ఉత్పత్తి విధానాలు వ్యవసాయ’ పారిశ్రామిక’ సేవా రంగాల్లో శీగ్రతర అభివృద్ధికి ప్రణాళికలను అమలు చేస్తున్నాం.
సుపరిపాలనకు _పెద్ద పీట
పార్లమెంటరీ పాలన వ్యవస్థలో ప్రజలందరికీ సమాన అవకాశాల కల్పన ‘లింగ సమానత్వం ‘ప్రాంతీయ సమానత్వం ‘మైనార్టీ రక్షణ
మానవ హక్కుల రక్షణ
సాధికారిత _భాగస్వామ్యం
యువజన ‘మహిళా సాధికారిత పాలనలో యువతకు భాగస్వామ్యం కల్పించడం జరిగింది . దివ్యాంగుల సంక్షేమం. పాలనలో జవాబుదారీతనం సుపరిపాలన పాలనలో పారదర్శకత’ జవాబుదారీతనానికి పెద్దపీట వేయడం జరిగింది.
ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్న పార్లమెంటు
సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటరీ విధానం ద్వారా ఎంపికైన ప్రభుత్వాలు పార్లమెంటరీ విలువలకు తిలోదకాలివ్వడం ఎన్నికైన ప్రభుత్వాలు అహంకారం’ నియంతృత్వం ‘అవినీతి’ అరాచక ‘ఏకపక్ష పాలనా విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా ప్రజాస్వామ్యం ఆశించిన స్వేచ్ఛ’ సమానత్వం’ సౌభ్రాతృత్వం ఎండమావి గానే మారిపోయింది.
చట్టసభలు తిట్లకు వేదికలు కాకూడదు
ప్రజలు ఎదుర్కొనే మౌలిక సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కొరకు వ్యక్తిగత రాగద్వేషాలకు తిట్లకు చట్టసభలు వేదికలు కావడం శోచనీయం. చట్ట సభలు అప్రజాస్వామిక పద ప్రయోగ
శాలలుగా మారిపోయినాయి.
రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట
అధికారంలో ఉన్న పార్టీకి నాయకులకు కార్యకర్తలకు లబ్ధి చేకూరే విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సామాన్యుల సాధికారిత నినాదంగానే మిగిలిపోయింది.
ఆర్థిక అసమానతలు
ఆర్థికశక్తి కేంద్రీకరణ జరిగి ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయి. కార్పొరేట్ ‘ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలను కొనసాగించడం వల్ల దేశంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే కేంద్రీకృతమై మిగతా ప్రాంతాలు ఆర్థికంగా’ సామాజికంగా ‘వెనుకబడి పోయి ‘దారిద్ర్యం తాండవిస్తోంది. అనేక ప్రాంతాలు వ్యవసాయ’ పారిశ్రామిక ‘ సేవా రంగాల్లో వెనుకబడిపోయినాయి.

పేదరికం_ అల్ప జీవన ప్రమాణాలు
ప్రజలు తీవ్ర ఆర్థిక అసమానతలతో ‘అల్ప జీవన ప్రమాణాలతో కూడు’ గూడు గుడ్డ’ లేని గడ్డు పరిస్థితిలో పేదరికంలోకి వెయబడే విచిత్ర పరిస్థితులు నెలకొనడం
విచారకరం.
సమగ్ర చర్చలు జరగాలి
పార్లమెంట్లో జాతీయ సమస్యల మీద ప్రతిపక్షం అధికారపక్షం సమగ్రంగా చర్చించకపోవడం వల్ల రూపొందించే చట్టాలు అమలులో అనేకసవాళ్లు ఎదురౌతున్నాయి.
ఆధునిక సాంకేతిక యుగంలో సంభవించిన మార్పులు పేదలకు అండగా నిలువడంలేదు. ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంలో ఆశించిన మేరకు పనిచేయడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం అధికారంలో ఉన్న పార్టీలను చీల్చడం రాజకీయ చదరంగంలో ప్రజలను పావులుగా వాడుకునే సంస్కృతికి అలవాటు పడిన రాజకీయ పార్టీలకు ఇటీవల దేశంలో జరిగిన 18 వ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ది చెప్పిప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చా టడం స్వాగతించదగిన పరిణామం.
స్వార్థ రాజకీయాలు మానాలి
అధికార పార్టీ స్వార్థపర రాజకీయాలు మానుకోవాలి. ప్రజల హక్కులకు రక్షణ’ భద్రత కరువైంది .ఉపాధి కల్పన ఊసే లేదు. మహిళా సాధికారిత’ యువజన సాధికారిక’ గ్రామీణ అభివృద్ధి చేతివృత్తుల రక్షణ
స్వదేశీ పరిశ్రమల స్థాపన ఖాదీ గ్రామీణ పరిశ్రమల నిర్లక్ష్యం కొనసాగుతూనే వుంది.
ప్రజాస్వామ్య పరిపుష్టి
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుచేయడానికి పాలన చట్టపరమైన చర్యల తీసుకోవాలి. చట్టసభల్లో బీ’సీ లకు రిజర్వేషన్లు మాటలకే పరిమితమైనాయి. మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం లో వాటా లభిస్తే ప్రజాస్వామ్యం పరిపుష్టమౌతుంది . జనాభాలో సగభాగం ఉన్న మహిళలు’ బీ’సీలు రాజ్యాధికారానికి దూరంగా నెట్టి వేయబడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించ బడుతున్నారు.
మహిళా’ ఎం ‘పీల సంఖ్య తక్కువ
పార్లమెంటరీ ఎన్నికల్లో ఎం’పీలుగా చట్టసభల్లో
మహిళలు 15 శాతం మించి ఎన్నిక కాని దుస్థితి కనబడుతుంది. చట్టసభల్లో బలహీన వర్గాలకు మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లేదు. బలహీన వర్గా లమహిళల సమస్యలపై గొంతుకలు పార్లమెంటు లేకపోవడం విచారకరం.
యువత జనాభాకు తగిన ప్రాతినిధ్యం లేదు
ప్రపంచ జనాభాలో 40 ఏండ్ల వయసున్న యువత 40 శాతం లోపు యువత ఉన్నప్పటికీ పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం 15% మాత్రమే వుంది. ప్రపంచ దేశాల్లోని 33 శాతం పార్లమెంట్లో 30 లోపు వయసు వున్న యువతకు ప్రాతినిధ్యం లేదు .ప్రపంచ దేశాలలో మహిళలు జనాభాలో సగభాగం ఉండి శాస్త్ర ‘సాంకేతిక రంగంలో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ఉన్నప్పటికీ చట్టసభల్లో సభ్యులుగా 20 నుంచి 30 శాతం పార్లమెంటుకు ఎన్నిక కాని దుస్థితి దాపురించింది.
భారతదేశంలో యువతకు అధికారంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని అభివృద్ధిలో వారిని సంపూర్ణ భాగంగా చేయాలన్న వాదనలు రోజు రోజుకు బలపడుతున్నాయి.
యువత రాజకీయాల్లోకి రావాలి ప్రధాని పిలుపు
ఎలాంటి రాజకీయ అనుభవం లేని లక్ష మంది యువకులు క్రియా శీల రాజకీయాల్లోకి రావాలని అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది అన్నదేశ ప్రధాని మోడీ గారి పిలుపు యువతకు మేలుకొలుపు కావాలి. యువతతో మెరుగైన రాజకీయాలు సాధ్యమని మనకి బాత్ కార్యక్రమంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కోవడం గమనార్హం.
ప్రజా సేవకులు_ చట్ట సభలకు ఎన్నిక కావాలి
ప్రజా సేవకులు చట్టసభలకు ఎన్నికకావాలి. (పార్లమెంటుకు) చట్టసభలకు ఎన్నికైన సభ్యులు ప్రజాసేవకులుగా ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలనా విధానాలు రూపొందించాలని ‘పౌరుల యొక్క సంక్షేమమే చట్టసభల సభ్యుల లక్ష్యం కావాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిర్ణిత కాలంలో అమలు చేసే క్రియాశీలక కార్యాచరణకు పెద్దపీట వేసే ప్రగతిశీల ప్రజాస్వామ్య పాలన విధానాలను ప్రజలు కోరుకుంటున్నారు.
దేశ సమస్యలు_ పరిష్కారం _సమగ్ర చట్టాలు
భారతదేశం ఎదుర్కొంటున్న పేదరికం నిరోద్యోగం ‘ఆర్థిక సామాజిక అసమానతలు’ బాల కార్మిక నిర్మూలన ‘వెట్టి చాకిరి’ లైంగిక హింస ‘స్త్రీ ‘ పురుష సమానత్వం ‘ ప్రాంతీయ అసమానతలు’ ఉచితంగా అందరికీ విద్య’ వైద్యం ప్రజలకు అందించాలి. ఆదునిక సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ప్రజల ముంగిట్లోకి చేర్చాలి. కులతత్వం’ మతతత్వం ప్రాంతీయతత్వం ‘ఉగ్రవాదం అగ్రవాదం ‘ సంఘ విద్రోహ చర్యలను అరికట్టడానికి సమగ్రమైన చట్టాలు రూపొందించాలి.
చట్ట సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలి
చట్ట సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని దీర్ఘకాలికంగాఅపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాలతో ప్రభుత్వాలు సమన్వయ సహకారాన్ని తీసుకోవాలి.
చట్ట సభలు తిట్ల సభలు కాకూడదు
చట్టసభలు తిట్ల సభలు కాకూడదు. పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ప్రతీకార వేదికలు కాకూడదు.
ధనవంతులు ఎన్నిక
18వ భారత పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో ధనవంతులు ఎన్నికైనారు.
ఎం’పి సగటు ఆస్తి విలువ 38రూ” కొట్లు కాగా 53 మంది ఎం’పి లు (7శాతం) బిలియనీర్లు ఉన్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
చట్టసభలు _ నేరఛరితులు
దేశంలోని 543 మంది ఎంపీల్లో 251 మంది(46 శాతం) మీధ తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నేరచరిత్ర ఉన్న వారే పార్లమెంటుకు ఎన్నిక కావడానికి అదనపు అర్హత కావడం విచారకరం.
ధనస్వామ్యంగా మారిన
ప్రజాస్వామ్యం
ధన బలం ‘కులబలం ప్రాంతీయ బలం ‘కండ బలం
రియల్ ఎస్టేట్ ‘సాండ్ మాఫియాలు మనదేశ పార్లమెంటరీ వ్యవస్థను శాసిస్తున్నాయి.
ప్రజల ఆశలు ‘ఆకాంక్షలు తీర్చే ప్రజాప్రతినిధులు’ చట్ట సభలకు సభ్యులుగా ఎన్నుకోబడాలి . నీతి నిజాయితీ పరులను ఎం’పీ’లుగా ఎన్నుకొని ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రజలు ఎదగాలి.

 

నేదునూరి కనకయ్య
ఛైర్మెన్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771

Join WhatsApp

Join Now

Leave a Comment