తల్లిదండ్రులు జరా జాగ్రత్త! పిల్లల సెల్‌ఫోన్ వినియోగంపై తాజా నివేదిక

పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ASER నివేదిక

🔹 14-16 ఏళ్లలో 82.2% మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను ఆపరేట్ చేయగలరు.
🔹 76% మంది పిల్లలు సోషల్ మీడియా కోసం ఫోన్లు వాడుతున్నారు.
🔹 విద్యా ప్రయోజనాల కోసం 57% మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.
🔹 90% కన్నా ఎక్కువ మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో కలిగి ఉన్నారు.
🔹 కేరళలో విద్యా ప్రయోజనాల కోసం ఫోన్ వినియోగం అత్యధికం.
🔹 దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మాయిలు టెక్నాలజీ వినియోగంలో అబ్బాయిలను అధిగమించారు.

 

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) షాకింగ్ వివరాలను వెల్లడించింది. 82.2% మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు ఆపరేట్ చేయగలిగినా, కేవలం 57% మాత్రమే వాటిని విద్య కోసం ఉపయోగిస్తున్నారు. అయితే 76% మంది పిల్లలు సోషల్ మీడియా కోసం ఫోన్లు వాడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

భారతదేశంలోని 605 గ్రామీణ జిల్లాల్లో నిర్వహించిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) ప్రకారం, 14-16 ఏళ్ల పిల్లల్లో 82.2% మంది స్మార్ట్‌ఫోన్‌లను వాడడం తెలిసినప్పటికీ, వారిలో కేవలం 57% మాత్రమే వాటిని విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.
తల్లిదండ్రుల అనుమతితో లేదా లేకుండానే 76% మంది పిల్లలు సోషల్ మీడియా కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు.

90% పైగా పిల్లలు ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్నారు.
85.5% అబ్బాయిలు మరియు 79.4% బాలికలు ఫోన్ వినియోగంలో నిపుణులు.
✅ విద్యా ప్రయోజనాల కోసం 80% మంది ఫోన్ వాడుతుంటే, 90% మంది సోషల్ మీడియా కోసమే వినియోగిస్తున్నారు.
✅ దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మాయిలు టెక్నాలజీ వినియోగంలో అబ్బాయిల కంటే ముందున్నారు.
YouTube వీడియోల కోసం 90% పైగా పిల్లలు ఫోన్ వాడుతున్నారు.

 

స్మార్ట్‌ఫోన్ వాడటం పిల్లలకు అవసరమే అయినా, అది విద్య కన్నా వినోదానికి ఎక్కువగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ పెంచి, వారి డిజిటల్ వినియోగాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment