కవల పిల్లల ప్రాణాల కోసం తల్లిదండ్రుల ప్రాధేయన
వైద్య ఖర్చులు భరించలేని కుంటాల మండల కుటుంబం సహాయం కోసం వేడుకుంటోంది
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – కుంటాల, డిసెంబర్ 27
నిర్మల్ జిల్లా కుంటాల మండలానికి చెందిన జక్కుల గంగరాజు–రాజశ్రీ దంపతుల కుటుంబం ఇప్పుడు కాలం పెట్టిన కఠిన పరీక్షలో ఉంది. వివాహం అయ్యి 14 సంవత్సరాల తరువాత దేవుని దయతో వీరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే, ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఏడు నెలలకే ప్రసవం జరగడంతో పుట్టిన కవలలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.
ప్రస్తుతం ఈ చిన్నారులు హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో వైద్యం పొందుతున్నారు. ఇప్పటికే గంగరాజు దంపతులు డెలివరీ మరియు ప్రారంభ చికిత్సల కోసం అప్పులు చేసి సుమారు ₹10 లక్షలు ఖర్చు చేశారు. అయినప్పటికీ చిన్నారుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
డాక్టర్లు తెలిపిన మేరకు — పిల్లలకు అధునాతన వైద్య సంరక్షణ అందించటానికి మరో ₹10 లక్షల రూపాయలు అవసరమని చెప్పారు. కానీ ఆర్థికంగా బలహీనమైన ఈ కుటుంబానికి ఆ మొత్తం సమకూర్చే మార్గం లేక తల్లిదండ్రులు ప్రజల సహాయం కోరుతున్నారు.
“మా పిల్లల్ని కాపాడండి… మీ చిన్న సహాయం మా పిల్లల ప్రాణాలను రక్షించగలదు,” అని తల్లి రాజశ్రీ కన్నీటి గాధ చెబుతున్నారు.
ఆపదలో ఉన్న ఈ కుటుంబానికి సహాయం చేయదలచిన వారు ఫోన్ పే నంబర్: 7093219531 ద్వారా చేయవచ్చు.
చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మీ చిన్న సహాయం పెద్ద ఆశగా మారొచ్చు — ఈ కుటుంబం దాతృత్వ హస్తం కోసం ఎదురు చూస్తోంది.