కోటపల్లి షెడ్యూలు కులాల వసతి గృహంలో పేరెంట్స్ కమిటీ మీటింగ్.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా, కోటపల్లి షెడ్యూలు కులాల వసతి గృహంలో పేరెంట్ కమిటీ సమావేశమును నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి సిహెచ్. దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు వసతిగృహ సంక్షేమ అధికారి యాసం శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పలు విషయాల గురించి చర్చించడం జరిగింది .ముందుగా వసతిగృహ సంక్షేమ అధికారి మాట్లాడుతూ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించడం జరిగింది.వసతి గృహంలో చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ స్టడీ హౌర్స్ నిర్వహిస్తూ చదువులో చురుకుదనంగా ఉండేటట్లుగా ప్రోత్సహించడం జరుగుతుంది అని అన్నారు.విద్యార్థుల ఆరోగ్యం పట్ల కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నెల నెలా మెడికల్ క్యాంపు లు నిర్వహించి ఆరోగ్యంగా ఉండేట్లు చూస్తున్నాము అని విద్యార్థుల తల్లిదండ్రుల కు వివరించడం జరిగింది .మరియు వసతిగృహ భవనం చాలా పాతది కావున కొత్త భవనం కోసం కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు వసతిగృహ సంక్షేమ అధికారిని కోరడం జరిగింది.చివరగా వసతి గృహ సంక్షేమ అధికారి మాట్లాడుతూ వసతి గృహ భవనం గురించి పై అధికారుల దృష్టితో కూడా ఉన్నది వారు కూడా సాధ్యమైనంత తొందరలో కొత్త భవనం మంజూరుకు కృషి చేయడం జరుగుతుంది అని వివరించడం జరిగింది