2వ సారి రక్తదానం చేసిన పల్లికొండ కార్తీక్
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 16
జీవన విధానంలో ప్రమాదాలు కావచ్చు ఇతర అనారోగ్య సమస్యలు కావచ్చు అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలు,లక్షల్లో ఉన్నారు.సరైన సమయంలో సాటి మనుషులు స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదని లక్ష్యంతో బాధపడుతున్న పేసెంట్లకు రక్తం దొరికే వరకు ఎదుటివారిని ప్రయత్నిస్తూ తన వంతుగా బాధ్యతగా మూడు నెలల ఒకసారి రక్తదానం చేస్తున్నాడు నిర్మల్ జిల్లా బోయవాడ కాలానికి చెందిన పల్లి కొండా కార్తీక్ నిర్మల్ జనరల్ ఆసుపత్రిలో లోలం గ్రామానికి చెందిన గుమ్ముల రాజన్న అనే పేషెంట్ కు ఏ పాజిటివ్ రక్తం కావాలి అని అనగానే వెంటనే వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. వీరికి సమయానికి ఆదుకున్న పల్లికొండ కార్తీక్ కు కుటుంబ సభ్యులు ధన్యవాదలు తెలిపారు.