అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం పోటీలు.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
అంతర్జాతీయ పులుల దినోత్సవ సందర్భంగా భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత మరియు అటవీ సంరక్షణ లో పులుల యెుక్క ప్రాముఖ్యత గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి. సుధాకర్, ఎఫ్ ఎస్ ఓ బి. రాజవ్వ, ఎఫ్ బి ఓ బి. శ్రీకాంత్, కె. శివకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు జి. తిరుపతి, వి. కవిత, ఎం. జ్యోతి మొదలగు వారు పాల్గొన్నారు