బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన OU విద్యార్థి జేఏసీ

బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన OU విద్యార్థి జేఏసీ

బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపిన OU విద్యార్థి జేఏసీ

 

  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌కు మద్దతు

  • కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపణ

  • రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని విద్యార్థుల పిలుపు



జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌కు మద్దతు తెలిపిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ, ప్రజలను ఆమెను గెలిపించాలని కోరింది. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు.



హైదరాబాద్, అక్టోబర్ 15 (మనోరంజని ప్రతినిధి)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులు సమావేశమై పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి,” అని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యేలా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment