ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అవకాశం

ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అవకాశం

ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అవకాశం

జూలై 31న జామ్ బాలికల గురుకులంలో కౌన్సిలింగ్

సారంగాపూర్, జామ్, జూలై 29 (M4News):

సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఆదేశాల మేరకు, జామ్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల ఇంటర్మీడియట్ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిపోయిన మొదటి సంవత్సరం సీట్ల భర్తీ కోసం జూలై 31న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సంగీత ఓ ప్రకటనలో తెలిపారు.

ఆసక్తిగల అర్హులైన విద్యార్థులు 2025 మార్చిలో పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. వారు తమ టీసీ, బోనాఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (01.01.2024 తర్వాత తీసుకున్నవి) తీసుకెళ్లి, జూలై 31న ఉదయం 9 నుంచి 1 గంట వరకు కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు. మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాల ప్రకారం సీట్లు కేటాయిస్తారని వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment