ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 26, 2024: సైబర్ కమాండో శిక్షణ కోసం తెలంగాణ నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఎంపిక అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్ ఈ గొప్ప అవకాశాన్ని పొందారు. బీటెక్ (CSE) చదివిన ప్రశాంత్, సాంకేతికతలో విశేష పట్టు సాధించి, కానిస్టేబుల్‌గా సైబర్ నేరాల విభాగంలో పనిచేస్తున్నారు. సైబర్ నేరాలపై అనుభవంతో పాటు, అతని సాంకేతిక నైపుణ్యం ఈ శిక్షణకు ఎంపికకు దారితీసింది. సైబర్ కమాండో శిక్షణ కోసం ప్రశాంత్ ఇప్పటికే కేరళకు వెళ్లారు.