కొండేక్కుతున్న ఉల్లిగడ్డ?

*కొండేక్కుతున్న ఉల్లిగడ్డ?*

మనోరంజని ప్రతినిధి

హైదరాబాద్: జనవరి 18
ఖరీఫ్, రబీ సీజన్లలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 87వేల 500 ఎకరాలు కాగా ఏటా సరాసరిన 5.25 లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.

ఇప్పటి వరకు కేవలం 20వేల 400 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేశారు. అక్టోబర్ నెలలో మార్కెట్లో గుట్టలు గుట్టలుగా కనిపించిన ఉల్లి, ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి,

దీంతో ఈ మధ్యకాలంలో ఉల్లి రేటు విపరీతంగా పెరిగిపోయాయి మూడు నెలల ముందు 20 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు పలుచోట్ల 50 నుండి 60 రూపాయలకు అమ్ముతున్నారు.

ముందు ముందు ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. ఇక ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలో ఇప్పటికే కిలో 100 రూపా యలకు అమ్ముతున్నారు.

తల్లి లాంటి ఉల్లిగడ్డ ధరలపై ప్రభుత్వాలు ముందుగానే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment