కొనసాగుతున్న ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 05
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని సుప్రసిద్ధ మహా పుణ్యక్షేత్రం అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ పునః ప్రతిష్టాపన వేడుకలు కొనసాగుతున్నాయి.
బుధవారం మూడవరోజు ఉదయం వేదపండితులు చంద్రశేఖర్ శర్మ ఆద్వర్యంలో మంగళ వాయిద్యాల మధ్య వేదపండితుల మంత్రోత్సవాలతో నిత్యవిధి,చండీపారాయణ,సహస్రకలిశస్థాపన,చండీ హోమం,విగ్రహాల ఫల పుష్పాదివాసము చేసారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి ల ఆద్వర్యంలో మహా అన్నదాన వితరణ చేసారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ స్వరంలోఅన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రంలో సొసైటీ చైర్మన్ ఐర నాయనారెడ్డి,మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,మాజీజడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి,దశరథ రాజేశ్వర్, మాధవ్ రావు, ఉట్ల రాజేశ్వర్,భోల్లోజి నర్సయ్య,ఓ నారాయణ రెడ్డి,రాజేశ్వర్ రావు, మారుతి, మాల ధారణ స్వాములు,భక్త జనులు పాల్గొన్నారు.