హత్యల కేసుల్లో శిక్షలు పెరగకపోవడం ఆందోళనకరం
m4news న్యూఢిల్లీ బ్యూరో
2022-23 సంవత్సరాల్లో ప్రతి నాలుగు రోజులకు ఒక జర్నలిస్టు హత్యకు గురైనట్లు యునెస్కో నివేదిక పేర్కొంది. యునెస్కో శనివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, జర్నలిస్టుల మరణాల సంఖ్యలో 38 శాతం పెరుగుదల కనిపించిందని, ప్రభుత్వం ఈ హత్యలను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరింది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే మాట్లాడుతూ, “సత్యాన్వేషణ చేసే జర్నలిస్టులపై హింస పెరుగుతోందని, ప్రతి నాలుగు రోజులకు ఒక జర్నలిస్టు చంపబడడం ఆందోళనకరమని” అన్నారు.
2022-23లో జర్నలిస్టులు మరణించిన వారిలో 86 శాతం మంది స్థానికంగా పనిచేస్తున్న జర్నలిస్టులేనని నివేదిక పేర్కొంది. 2023లో పాలస్తీనాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని, ఆ ప్రాంతంలో 24 మంది జర్నలిస్టులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరణించారని వెల్లడించింది. గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయిల్ యుద్ధాలను కవర్ చేస్తూ మరణించిన జర్నలిస్టుల సంఖ్య 135కు పెరిగినట్లు నివేదికలో ప్రస్తావించారు.
2022-23లో హతమైన జర్నలిస్టులలో 14 మంది మహిళలు ఉండగా, ఐదుగురు 15-24 వయస్సు గల యువ జర్నలిస్టులే ఉండటం దురదృష్టకరమని యునెస్కో పేర్కొంది.
ఈ హత్యల కేసుల్లో 85 శాతం ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని యుఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో