కోజగిరి పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వదత్త పీఠంలో భక్తిశ్రద్ధలతో పౌర్ణమి వేడుకలు
వినాయక్‌నగర్, నిజామాబాద్ జిల్లా:
కోజగిరి పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ విశ్వదత్త పీఠం వారి ఆధ్వర్యంలో పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విశ్వదత్త గురువు సమక్షంలో, శివకేశవనాథ్ స్వామి గంగాధర్ గౌడ్ గారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు, పవిత్ర క్రియలు నిర్వహించబడ్డాయి.
వినాయక్‌నగర్‌లోని పీఠంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని, చంద్రుడిని పాలలో దర్శించుకోవడం అనే పవిత్ర ప్రక్రియలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పీఠ సభ్యులు మాట్లాడుతూ –
“కోజగిరి పౌర్ణమి రోజున చంద్రుని పాలలో దర్శించుకుంటే, గ్రహణ దోషాలు, సంతాన సంబంధిత దోషాలు తొలగిపోతాయని, మానవుని జీవితంలో వచ్చే అనుకోని గండాలు తొలగిపోతాయని పూర్వీకుల నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు.
అలాగే, ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కృపతో మానవులు రక్షణ పొందతారని, సామూహిక భజనలు, సాంప్రదాయ ఆచారాలు మన సమాజాన్ని ధార్మికంగా, ఆధ్యాత్మికంగా మలుపు తిప్పుతాయని పీఠానికి చెందిన గురువులు తెలియజేశారు.
ఈ వేడుకల్లో పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. పౌర్ణమి చంద్రుని తేజస్సుతో ఆలయం పరిసరాలు దేవతాత్మక శోభను సంతరించుకున్నాయి.