ఆదివారమే ఉపరాష్ట్రపతి ఎన్నిక! అభ్యర్థిపై ఉత్కంఠ
ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్కడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం (ఆగస్టు 17న) ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇక ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నందున.. ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది