ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
మనోరంజని ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్ 19
నిర్మల్ జిల్లా కలెక్టర్
కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు తొలగింపునకు ప్రతి 20–25 ఏళ్లకు ఒకసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎస్.ఐ.ఆర్ నిర్వహించారని గుర్తు చేశారు. ఎస్.ఐ.ఆర్ సమర్థవంతంగా నిర్వహించేందుకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దారులు, బిఎల్ఓలు, పర్యవేక్షకులు తగినంతగా ఉన్నారని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందుగా 2002 ఎస్ఐఆర్ వివరాలను 2025 ఎస్ఎస్ఆర్ డేటాతో సరిపోల్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు