పంట కొనుగోళ్లకు అధికారులు సిద్ధంగా ఉండాలి
భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్
భైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 16
సోయా- పత్తి పంటల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు ఇచ్చే అవకాశమున్నందునా అధికారులు సిద్ధంగా ఉండాలని భైంసా సబ్-కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. గురువారం భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డివిజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మార్కెట్ అధికారులు తూకాల్లో మోసాలు జరుగకుండా చూసుకోవాలన్నారు. బైంసా, కుబీర్ ఏఎంసి ఛైర్మన్ లు ఆనంద్ రావు పటేల్, కళ్యాణ్, వివిధ శాఖల అధికారులు, రైతు ప్రతినిధులు, తదితరులు ఉన్నారు