అడెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

అడెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం

మనోరంజని ప్రతినిధి, సారంగాపూర్

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 15 వరకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, పోషక ఆహారం, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, కిశోర బాలికల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు, అంగన్‌వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, అరుణ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment