- నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శరన్నవరాత్రులు జరుగుతున్నాయి.
- 8వ రోజుకు అమ్మవారు “మహాగౌరి” దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు.
- అమ్మవారికి చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించారు.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 8వ రోజుకు “మహాగౌరి” దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లటి వృషభ వాహనంపై ఆసీనులై, చతుర్భుజాలు కలిగి భక్తులను అనుగ్రహిస్తున్నారు. వైదిక బృందం చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించి, నైవేద్యంగా చక్కెర పొంగలి అమ్మవారికి నివేదించారు.
నిర్మల్ జిల్లా ప్రస్తుత పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 8వ రోజుకు అమ్మవారు “మహాగౌరి” దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు తెల్లటి వృషభ వాహనం (ఎద్దు)పై ఆసీనులై, చతుర్భుజాలు కలిగి త్రిశూలం, డమరుకము, వరముద్ర, అభయముద్రలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు.
వైదిక బృందం అమ్మవారి సన్నధిలో చతుషష్టి ఉపచార పూజలు గౌరీ నామార్చన నిర్వహించి, చక్కెర పొంగలి ని నైవేద్యంగా అమ్మవారికి నివేదించారు. అక్షరాభ్యాస మండపంలో క్యూలైన్లో భక్తులకు, మహిళలకు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఆలయ ఈఓ విజయ రామారావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలకు అతీతమైన బతుకమ్మ పండుగ ప్రధానంగా గౌరీ దేవతను ఆరాధించే తత్వంతో విరాజిల్లే పండుగగా ఈ ప్రాంత ప్రజలలో ఇమిడిపోయింది. శివుని భార్య అయిన గౌరీ దేవత అమ్మవారి అసలు పేరు పార్వతి (ఉమ)గా, గణేశుడు మరియు కార్తికేయుల తల్లి గాశాక్త విశ్వాసంలో అమ్మవారు విష్ణువు సోదరిగా పరిగణించబడుతుంది.
గౌరీ దేవత లలితా మహా త్రిపురసుందరి యొక్క పూర్తి అవతారంగా భక్తులు భావిస్తారు. అష్టమి రోజున గౌరీ దేవత అవతారంలో “శ్వేతే వృషే సమారూఢా శ్వేతామ్బరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా” అంటూ అమ్మవారిని ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు లభించి, మనస్సులో ఉన్న కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉంది.