మహాగాం సర్పంచ్‌గా కొంచపు నాగమణి నామినేషన్
మనోరంజని తెలుగు టైమ్స్ — భైంసా, డిసెంబర్ 3
నిర్మల్ జిల్లాలోని భైంసా మండల కేంద్రానికి చెందిన మహాగాం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి కొంచపు నాగమణి శంకర్ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారుల ఎదుట నామినేషన్ సమర్పించిన అనంతరం ఆమె అనుచరులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు మరింత కృషి చేస్తానని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. గ్రామ పూర్వీధుల్లో డప్పు–సప్పులతో గడపగడపకు తిరుగుతూ ప్రజల మద్దతు కోరారు. ఆమె వెంట గ్రామస్తులు, పలువురు యువకులు పాల్గొన్నారు.