పద్మ అవార్డులకు నామినేషన్ గడువు పెంపు
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులకు నామినేషన్ల గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 ఏడాదికి గాను పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను స్వీకరించే గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. నామినేషన్లు ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించబడతాయని స్పష్టంచేసింది. ఇందుకోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా నామినేషన్‌లు సమర్పించాలని అధికారికంగా తెలిపింది