నామినేట్ పదవులు ప్రకటనలకే పరిమితమ… అమలుకు నోచుకునేదెప్పుడో
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
భైంసా: అక్టోబర్ 16
ఇటీవల కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో నామినేట్ పదవులు కేటాయించబడ్డాయి. అయితే, నెల రోజులు గడిచినా, ప్రభుత్వ పరిధిలో ప్రమాణ స్వీకారానికి ఇంకా నోచుకోలేకపోతున్నారు. దీనిపై తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకెటపో శెట్టి స్పందించారు.
భైంసా పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన శెట్టి, “నామినేట్ పదవుల విషయంలో అగ్ర కులాల వారికి ఒక న్యాయం, బలహీన వర్గాలకు ఇంకొక న్యాయమా?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వెంటనే బీసీ బలహీన వర్గాలకు ప్రకటించిన నామినేట్ పదవులను అమలు చేయాలని, నియామక పత్రాలను అందచేయాలని డిమాండ్ చేశారు.
లేనిదెతట, రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీ బలహీన వర్గాలకు జరుగుతున్న వివక్షతను ఎండకడతామని సుంకెటపో శెట్టి హెచ్చరించారు.