- యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీల వార్తలు అవాస్తవం అని కేంద్రం స్పష్టం.
- సాధారణ UPI పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవు.
- డిజిటల్ వ్యాలెట్లు (PPI) పై మాత్రమే ఛార్జీలు అమలు.
- PIB ఫ్యాక్ట్‌చెక్ ద్వారా తప్పుదారిన పారించే ప్రచారాన్ని ఖండింపు.
UPI ద్వారా సాధారణంగా డబ్బులు పంపించే వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు లేవు అని కేంద్రం స్పష్టం చేసింది. రూ.2000కి పైగా ట్రాన్సాక్షన్‌లపై ఛార్జీలు ఉంటాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని PIB ఫ్యాక్ట్‌చెక్ ప్రకటించింది. ఇది కేవలం డిజిటల్ వ్యాలెట్లకు (PPI) వర్తించే నిబంధన అని వివరించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 16:
దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్న UPI పేమెంట్ సిస్టమ్ పై ఛార్జీలకు సంబంధించి వచ్చిన పుకార్లను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. పలు మీడియా సంస్థలు రూ.2,000కు పైగా UPI ట్రాన్సాక్షన్‌లపై 1.1% ఛార్జీలు ఉంటాయని ప్రచారం చేయడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది.
ఈ వార్తలపై PIB ఫ్యాక్ట్‌చెక్ స్పందిస్తూ, సాధారణ UPI పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ఛార్జీలు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్స్ (PPI) వంటి డిజిటల్ వ్యాలెట్లకు మాత్రమే వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది. UPI పేమెంట్స్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ట్రాన్సాక్షన్ ఛార్జీలను తొలగించినట్లు గుర్తు చేసింది.