రైతులకు జీవనదిగా నిజాంసాగర్ నీరు – సీఎం రేవంత్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు

జూన్ 19, 2025 – కోటగిరి

రైతులకు జీవనదిగా నిజాంసాగర్ నీరు – సీఎం రేవంత్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు

కోటగిరి ఉమ్మడి మండలాల్లో వర్షాభావం తీవ్రంగా ప్రభావం చూపడంతో పంట పొలాలు నీటిలేక బీటలు బారిపోయాయి. ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలు, తలపోయిన ఆశలు కనిపించాయి. అలాంటి సంక్షోభ సమయంలో నిజాంసాగర్ నుండి నీటిని వదిలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అహర్నిశలు కృషి చేయడంతో రైతులకు ఊరటనిచ్చింది.

నిజాంసాగర్ నుండి వచ్చిన నీరు పంట పొలాలకు చేరడంతో బీటలు బారిన పొలాలు మళ్లీ సస్యశ్యామలంగా మారాయి. ఈ నేపథ్యంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెddy కి కృతజ్ఞతలు తెలియజేశారు. “ఇదొక పునర్జన్మ లాంటి రోజు. మా పంటలకు ప్రాణవాయువు పోసిన నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు” అని పలువురు రైతులు పేర్కొన్నారు.

రైతుల హక్కులు, అవసరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసేలా పని చేస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్యలను రైతులు ప్రశంసిస్తున్నారు. “మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం కోసం కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం” అని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు తమ పంట పొలాల్లోకి నీరు వచ్చి నిల్వగా ఉన్న దృశ్యాలను చూపిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. రైతుల చిరునవ్వు వెనుక ఉన్న నాయకుల కృషికి గ్రామాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment