ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల ఎంపిక

Nirmal and Somashila Tourism Award Ceremony
  • 2024లో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన పోటీల్లో నిర్మల్, సోమశిల ఉత్తమ పర్యాటక గ్రామాలు
  • నిర్మల్ “క్రాఫ్ట్స్” కేటగిరీలో, సోమశిల “స్పిరిచ్యువల్ – వెల్నెస్” కేటగిరీలో ఎంపిక
  • అవార్డులు ప్రదానం చేయడానికి జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు

Nirmal and Somashila Tourism Award Ceremony

2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన పోటీల్లో, నిర్మల్ జిల్లా “క్రాఫ్ట్స్” కేటగిరీలో, నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల “స్పిరిచ్యువల్ – వెల్నెస్” కేటగిరీలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ముఖ్య అతిధిగా ఉన్నారు.

Nirmal and Somashila Tourism Award Ceremony

2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన పోటీలలో, ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్ జిల్లా నిర్మల్ మరియు నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామాలు ఎంపిక అయ్యాయి. నిర్మల్ గ్రామం “క్రాఫ్ట్స్” కేటగిరీలో, సోమశిల గ్రామం “స్పిరిచ్యువల్ – వెల్నెస్” కేటగిరీలో ఉత్తమంగా గుర్తించబడ్డాయి.

ఈ అవార్డులను ప్రదానం చేయడానికి గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ముఖ్య అతిధిగా ఉన్నారు. అవార్డులు అందుకున్న నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్. పెంటయ్య మరియు సోమశిల జిల్లా పర్యాటక శాఖ అధికారి టి. నర్సింహా గారు బహుమతులను స్వీకరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment