ఎల్‌ఎస్‌ఈల కోసం నిర్మల్ పోలీసుల గట్టి బందోబస్తు

ఎల్‌ఎస్‌ఈల కోసం నిర్మల్ పోలీసుల గట్టి బందోబస్తు

జిల్లా వ్యాప్తంగా 12 చెక్‌పోస్టులు – అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
“నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు” – ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్

మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్, నవంబర్ 27
ఎల్‌ఎస్‌ఈల కోసం నిర్మల్ పోలీసుల గట్టి బందోబస్తు

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతతగా సాగేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా, మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, 8 ఇంటర్‌స్టేట్ చెక్‌పోస్టులు, 4 ఇంటర్‌-డిస్ట్రిక్ట్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అదనపు పోలీసు సిబ్బందిని మోహరించారు. 24 గంటల విధానంలో వాహనాలు, వ్యక్తుల తనిఖీలు నిరంతరం కొనసాగనున్నాయి. ఎన్నికల కాలంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్‌స్టేట్ చెక్‌పోస్టులు

సారంగాపూర్ – రామ్‌సింగ్ తాండా, కుబీర్ మండలం – సిర్పెల్లి హెచ్, సేవాలాల్ తాండా, డోడర్న తాండా, కుంటాల – దౌనెల్లీ తాండా, తానూరు – బెల్‌తరోడ, జవుల–బి, బాసర – బిద్రెల్లి ఏర్పాట్లు చేశారు.

ఇంటర్‌-డిస్ట్రిక్ట్ చెక్‌పోస్టులు

బాసర – గోదావరి బ్రిడ్జి, ఖానాపూర్ – బాదనకుర్తి
,కడెం – పాండవపూర్ , సోన్ – గంజాల్ టోల్ ప్లాజా, ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు పర్యవేక్షణను మరింత బలోపేతం చేశాయి. అక్రమంగా తరలించే నగదు, మద్యం, ఆయుధాలు, ప్రలోభకర వస్తువులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి గస్తీని పెంచి అనుమానాస్పద కదలికలపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరుతూ, సందేహాస్పద సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని ఎస్పీ డా. జానకి షర్మిల విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment