బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభకు నిర్మల్ సభ్యు

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభకు నిర్మల్ సభ్యులు
నిర్మల్:
సోమవారం హైదరాబాదులో ప్రారంభించే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభకు జిల్లా నుంచి పలువురు నాయకులు బయలుదేరారు. ఆ జేఏసీ కన్వీనర్ రాఘవేంద్ర ముదిరాజ్ పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి బయలుదేరినట్లు నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్న వారికి హక్కులు, అధికారంలో వాటా దక్కడం లేదని, అగ్రకులాలే ఈ మొత్తం రావాల్సిన వాటాను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇకపై జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు భారత రాజ్యాంగ హక్కులు, రాజ్యాధికారం పై చైతన్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజు మహారాజ్, సొన్న భూమేష్, కల్లూర్ సుధాకర్, సిలారి శ్రీనివాస్, ప్రవీన్ ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment