నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి
-
సీనియర్ నేత: పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్ష పదవికి ఆహ్వానం
-
రాజకీయ అనుభవం: 1995 నుండి 2024 వరకు వివిధ పదవులు, జడ్పిటిసి & ఫారెస్ట్ ప్రొడక్షన్ స్టేట్ మెంబర్
-
సారంగాపూర్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో బలమైన పట్టు
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల సీనియర్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, 1995 నుంచి వివిధ రాజకీయ పదవులు భరించిన అనుభవజ్ఞుడు. సారంగాపూర్ జడ్పిటిసి సభ్యునిగా, ఫారెస్ట్ ప్రొడక్షన్ స్టేట్ మెంబర్‌గా పని చేసిన ఆయన, 23.03.2023న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రాంతీయ నాయకులకోసం ఆయన డిసిసి అధ్యక్ష పదవికి ఉన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల సీనియర్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి అనేక రాజకీయ పదవుల అనుభవజ్ఞుడు. 1995–2000 వరకు సారంగాపూర్ మండల (MPP) మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా, 2001–2006 వరకు జడ్పీటీసీగా, 2014–2019, 2019–2024 వరకు సారంగాపూర్ జడ్పిటిసి సభ్యునిగా పనిచేశారు. 2015–2018 మధ్య ఫారెస్ట్ ప్రొడక్షన్ స్టేట్ మెంబర్‌గా కొనసాగారు. 23.03.2023న తెలంగాణ రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సారంగాపూర్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో బలమైన ప్రజా పట్టు కలిగిన ఆయనకు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుని పదవి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.