* *వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్*
*ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్*
* *నవరాత్రి ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేక ధన్యవాదాలు*
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ ఆగస్టు 25
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వినాయక చవితి కమిటీలు తగు జాగ్రత్తలు పాటించాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించాలని గోవింద నాయక్ సూచించారు. విద్యుత్ తీగల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వినాయక కమిటీలు గొడవలకు తావివ్వకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం వినాయక మండపాలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ సరఫరాను వినియోగించుకోవాలని కోరారు. అలాగే మరొక సారి వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.