గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం

గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం

శ్రీ చక్ర స్వాముల గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తుల సందడి

మనోరంజని తెలుగు టైమ్స్ భీమ్‌గల్ ప్రతినిధి – అక్టోబర్ 3, నిజామాబాద్ జిల్లా

గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని లింబాద్రి గుట్టపై ప్రతి యేటా నిర్వహించే శ్రీ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన నింబాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమం గోవింద నామ స్మరణతో మార్మోగింది.

గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం

నింబాచల గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మోక్షం కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అక్టోబర్ 27 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా, శ్రీ లక్ష్మీ నరసింహుని ఆయుధమైన శ్రీ చక్ర స్వాముల వారు పల్లకిలో పుష్పాలతో అలంకరించబడి, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేశారు.

మేళతాళాలు, భజనలు, మంగళహారతులు, గోవింద నామస్మరణలతో భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. వేలాదిమంది భక్తులు పాల్గొనడంతో నింబాచల గుట్ట గోవింద నామధ్వనులతో మార్మోగిపోయింది.

భక్తుల నమ్మకానికి అనుగుణంగా, నింబగిరి శ్రీ లక్ష్మీ నృసింహుడు గిరి ప్రదక్షిణ చేసిన వారికి ఆయురారోగ్యాలు, సకల సౌఖ్యాలు ప్రసాదిస్తాడని విశ్వాసం.

ఈ సందర్భంగా సర్వసమాజ కమిటీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ, “భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. జాతర రోజున తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాం” అని తెలిపారు.

గిరి ప్రదక్షిణ సందర్భంగా భీమ్‌గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఎస్సై సందీప్‌తో పాటు సివిల్ పోలీసులు, మహిళా సిబ్బంది విధులు నిర్వర్తించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment