పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

మనోరంజని ప్రతినిధి వెంకటాపూర్ (రామప్ప) జులై 30 – వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, కేశవాపూర్ గ్రామానికి చెందిన వేల్పుగొండ రవీందర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరై తన సోదరులు వేల్పుగొండ రవీందర్- రమాదేవి దంపతులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపి శేష జీవితంలో ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజా జీవితంలో తమ అనుభవాలను సేవా కార్యక్రమాల ద్వారా ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు.

పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

ఉద్యోగ జీవితం ఒక మెట్టు మాత్రమేనని, ఉద్యోగ విరమణతో తాము చేసే పనులకు ముగింపు కాదని ఇంకా కొత్త జీవితంలో ఈ సమాజానికి కొత్త వెలుగులు ప్రసాదించే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. పాఠశాల ఉపాధ్యాయ బృందంతోపాటు రవీందర్ మిత్రులు, శిష్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రవీందర్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, సర్వర్ అహ్మద్, శ్రీరంగం, రాజయ్య, నాయకులు అబ్బ గోపాల్ రెడ్డి, కుతుబుద్ధిన్, స్వామిరావు, సీఆర్పీలు కుమార్ పాడ్య, కర్ణాకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment