హనుమకొండ, 30 July
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వరి నాట్లు వేసే పనులు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మహిళా రైతులు తమ పనిని ఆనందంగా చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నారు. పొలంలోనే ఉత్సాహంగా పాటలకు స్టెప్పులేస్తూ వరి నారు నాట్లు వేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మహిళా రైతులు తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. పొలంలోనే ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు, చేతిలో వరి నారు పట్టుకొని 'బిందే మీద బిందే పెట్టి' పాటకి స్టెప్పులేస్తూ నాట్లు వేశారు.
ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కష్టమైన వ్యవసాయ పనుల్లోనూ రైతులు ప్రదర్శించిన ఈ ఆనందం, ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంటోంది.












