నిర్మల్, 2024-06-29
వరదల సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐఏఎస్ అధ్యక్షతన నిర్వహించిన వరదల నివారణ, విపత్తు నిర్వహణపై ముందస్తు సన్నద్ధత సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
వరదల సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐఏఎస్ అధ్యక్షతన నిర్వహించిన వరదల నివారణ, విపత్తు నిర్వహణపై ముందస్తు సన్నద్ధత సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గత సంవత్సరాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎదురైన పరిస్థితులు, వాగులు, వంకలు పొంగిన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల సమస్యలు, రహదారుల నష్టం, ప్రజల తరలింపు, సహాయక చర్యలపై అధికారులు సమీక్షించారు.
జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తామని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల కోసం పోలీస్ శాఖ వద్ద రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైతే ప్రత్యేక బృందాల ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు.
వాగులు, వంకలు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రజలు ప్రయత్నించవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
యువత సెల్ఫీలు, వీడియోల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లవద్దని, తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, విద్యుత్, గ్రామపంచాయతీ శాఖలతో సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.












