Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
మండలంలోని వంజర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చందాల లచ్చవ్వ–రమేశ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీకాంత్ రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై గ్రామ ప్రజలు, రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వ్యవసాయ అధికారి లక్ష్మీ మాట్లాడుతూ వంజర్ గ్రామానికి చెందిన 154 మంది రైతులు రైతు నమోదు ప్రక్రియ పూర్తి చేయలేదని, వారు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
గ్రామ పాలనాధికారి నవీన్ మాట్లాడుతూ 111 మంది ఓటరు నమోదు చేయించుకోలేదని, అర్హులైన వారు ఆలస్యం చేయకుండా ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ్, మండల ఉపాధి హామీ అధికారి లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ మౌనిక–నవీన్, అంగన్వాడీ కార్యకర్తలు గంగామణి, ప్రియాంక, క్షేత్ర సహాయకుడు రాజు, సాంకేతిక సహాయకుడు సునీల్, ఆశ కార్యకర్త గంగామణి, కరోబార్ లక్ష్మీ, వార్డు సభ్యులు గోనె శివ, మహేశ్, అశోక్, రుక్మారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, వెలుగు సంఘం ప్రతినిధి సుష్మ, మాజీ ఆత్మ డైరెక్టర్ మహేశ్ యాదవ్, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.