హైదరాబాద్, జులై 22
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొనేందుకు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొంటారు.
ఈనెల 26న ఉదయం 11:35 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, మధ్యాహ్నం 12:45 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 12:50 గంటలకు హెలికాప్టర్లో కరీంనగర్‌కు బయలుదేరి వస్తారు.
మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెలిప్యాడ్‌కు చేరుకుని, 1:55 గంటలకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం ఉంటుంది.
ఆ తర్వాత, మధ్యాహ్నం 2:30 నుంచి 3:45 గంటల వరకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరి, సాయంత్రం 5:00 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.












