బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (ఎస్టీయూటీఎస్) ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన సామగ్రిని బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉపయోగపడేలా నాణ్యమైన అధ్యయన సామగ్రిని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.

ఉపాధ్యాయ సంఘాల పాత్ర
ఉపాధ్యాయ సంఘాలు తమ హక్కుల సాధనతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అధ్యయన సామగ్రిని సద్వినియోగం చేసుకుని టెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
అధ్యయన సామగ్రి విశిష్టత
ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నిపుణులచే రూపొందించిన ఈ అధ్యయన సామగ్రి టెట్ అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిలబస్‌కు అనుగుణంగా, పరీక్షా విధానాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పుస్తకాలు అభ్యర్థుల విజయానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, ఆర్థిక కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాంపల్లి నాగభూషన్, ఏ. బాజారెడ్డి, పలిసికల్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోలీస్ కర్ గంగాధర్, గంగాధర్ బోస్లే, పిప్పెర శ్రీనివాస్, బసిరుద్దీన్, కటకం శ్రీనివాస్, మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, ఎస్. గణపతి, బర్ల గంగాధర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.