తెలంగాణ రాష్ట్ర యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూ డబ్ల్యూజే-ఐజేయు) నల్గొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎం. ఫక్రుద్దీన్ (అస్లాం) ను ఎంపిక చేశారు.
నకిరేకల్ లో జరిగిన టీయూ డబ్ల్యూజే-ఐజేయు నల్గొండ జిల్లా మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సభలో నల్గొండ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీయూ డబ్ల్యూజే-ఐజేయు నల్గొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు.
మూడు దశాబ్దాలకు పైగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్న అస్లాంను జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అస్లాం తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త కమిటీ సమర్థంగా పని చేయాలని కృష్ణారెడ్డి ఆకాంక్షించారు.












