హైదరాబాద్, జులై 17
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో విధించిన సొంత నిధుల వినియోగ పరిమితులను ఎత్తివేస్తూ, పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70(3)కు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
తెలంగాణలోని గ్రామ పంచాయతీల ఆర్థిక స్వేచ్ఛ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల సొంత నిధుల వాడకంపై విధించిన పరిమితులను ఎత్తివేయబోతోంది. ఇందులో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 70(3) కి సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై వారికి పూర్తి స్వేచ్ఛ కల్పించేలా, ఈరోజు జరగబోయే మంత్రివర్గ క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.
దీనివల్ల నిధుల కోసం ప్రభుత్వ ట్రెజరీపై ఆధారపడాల్సిన అవసరం తప్పడమే కాకుండా, గ్రామంలో వసూలైన డబ్బును వెంటనే స్థానిక అభివృద్ధి పనుల కోసం వేగంగా ఖర్చు చేసుకునే వీలు కలుగుతుంది.
ఫలితంగా గ్రామాల్లో అత్యంత కీలకమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఇతర అత్యవసర మౌలిక వసతుల పనులు ఎక్కడికక్కడ ఎలాంటి జాప్యం లేకుండా మరింత వేగంగా సాగేందుకు మార్గం సుగమం కానుంది.












