బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
సోనాల మండలంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధమత స్వీకరణ, రాజ్యాంగ రచనలో ఆయన పాత్రను కొనియాడారు. నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సోనాల మండల కేంద్రంలోని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సోనాల మండల నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన భారతీయ బౌద్ధమసభ (బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా) సంఘంలో పనిచేయడం చాలా సంతోషమని తెలిపారు. ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలకు ఓర్చి మనందరికీ రాజ్యాంగబద్ధమైన హక్కులతో పాటు ఓటు హక్కును కూడా కల్పించిన ప్రపంచ మేధావి అని కొనియాడారు. 1956లో ఆరు లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో బుద్ధిజాన్ని స్వీకరించారని గుర్తు చేశారు.
అంబేద్కర్ అంటే వ్యక్తి కాదని, ఒక శక్తి అని ప్రజ్ఞ కుమార్ అన్నారు.
అనంతరం సోనాల నూతన కమిటీ సభ్యుల వివరాలను ప్రకటించారు. సోనాల బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా అమృత్ రావు పాటిల్, ప్రధాన కార్యదర్శిగా పాముల సంతోష్ కుమార్, కోశాధికారిగా ఏరేకార్ యశ్వంత్ రావ్, తో పాటు 18 మందితో కూడిన కార్యవర్గాన్ని ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు విఠల్ బుక్టే, జిల్లా ఉపాధ్యక్షులు జితేందర్ పవర్, కోశాధికారి కాంతారావు వాగ్మారే, మాజీ జిల్లా అధ్యక్షులు దయానంద్ కాంబ్లే, బోథ్ నియోజకవర్గ నాయకులు భీంరావు పాటిల్, సోనాల మహార్ సంఘం అధ్యక్షుడు భగత్ శంకర్, కార్యవర్గ సభ్యులు మహేష్, నాగార్జున్, లక్ష్మణ్, మల్లయ్య, శ్యామ్ రావు, లక్ష్మణ్, దేవరావు, రాజు, సోమన్న తదితరులు పాల్గొన్నారు.












